Header Banner

అదృశ్యమైన ఐదు విద్యార్థినుల్ని రక్షించిన పోలీసులు! హోంమంత్రి అనిత ప్రశంసలు!

  Thu Feb 20, 2025 18:50        Politics

పోలీసు అధికారులపై హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు కురిపించారు. మీ సేవలు బాగున్నాయని కితాబు ఇచ్చారు. విద్యార్థునుల ఆచూకీ కనిపెట్టడంలో చాకచక్యంగా వ్యవహారించారని హోంమంత్రి అనిత ప్రశంసించారు.

సత్తెనపల్లి పోలీసులపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసల వర్షం కురిపించారు. కృష్ణ జిల్లా గన్నవరంలో ఐదుగురు విద్యార్థుల అదృశ్యంపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ విషయంపై సత్తెనపల్లి పోలీసులకు గన్నవరం పోలీసులు సమాచారం ఇచ్చారు. ట్రైన్‌లో విద్యార్థినులు వెళ్తున్నారని సమాచారంతో అర్థరాత్రి సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌కు సత్తెనపల్లి పోలీసులు వెళ్లారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కోణార్క్ ట్రైన్‌లో పిడుగు రాళ్ల దగ్గర విద్యార్థినులను సత్తెనపల్లి పోలీసులు పట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: విజయవాడ రూట్లో టీజీఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్! బస్సు టికెట్లపై భారీ రాయితీలు!

విద్యార్థినులను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులకు ప్రశంసలు కురిపించారు. ప్రజా పోలీసింగ్ అంటే ఇలా ఉండాలని కితాబు ఇచ్చారు. డీఎస్పీ హనుమంతు రావు ,సీఐ బ్రహ్మ య్యకు ప్రత్యేకంగా ఫోన్ చేసి హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు.

కాగా, కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ముస్తాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థినులు విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. అయితే వీరంతా కాలేజీ హాస్టల్ నుంచి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. తమ స్నేహితులు కనిపించకపోవడంతో కళాశాల సిబ్బందికి తోటి విద్యార్థినులు సమాచారం అందించారు.

కాలేజీ అంతా వెతికినా విద్యార్థినుల ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీకి వెళ్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే విద్యార్థినులు హైదరాబాద్ వైపు వెళ్తున్నారని సమాచారం అందడంతో వారి కోసం గాలించారు. పలు పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత విద్యార్థునులను పోలీసులు పట్టుకున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 

 


   #AndhraPravasi #Andhrapradesh #homeminister #vangalapudianitha #anitha #Chandrababu #APpolitics #naralokesh #police #rescue